15 June, 2026 | 6:31 PM

Breaking News

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •  

స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డీసీఎం

06-04-2026 12:54 AM
  1. భార్య మృతి, భర్తకు గాయాలు

పరారీలో డ్రైవర్ పోలీసుల అదుపులో క్లీనర్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి మా దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ డిసిఎం ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డిసిఎం వాహనం కింద ఇరుక్కుపోయింది. ప్రమాదం అనంతరం స్కూటీ డీసీఎం చక్రాల కింద ఇరు క్కుపోయినా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వాహనాన్ని అడ్డుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.

డ్రైవర్ పారిపోగా, సహాయకుడిని పట్టుకున్న స్థానికులు అతడిని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను ఆసుపత్రికి తరలించగా, హనియ్యా ఆయేషా (22) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరిం చారు.

ఆమె భర్త అబ్దుల్ బాసిత్ (26) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళకు చెందిన ఈ దంపతులు నగరంలోని మహేశ్వరం సమీపంలో నివసిస్తూ, మలబార్ గోల్ సంస్థలో పనిచేస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.