మందకోడిగా 2026 -27 విద్యా సంవత్సరం ప్రారంభo
15-06-2026 04:33 PM
మొదటి రోజే అమావాస్య రావడంతో తగ్గిన విద్యార్థుల హాజరు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): 2026-27 విద్యా సంవత్సరం మండకోడీగా, నేటి నుండి ప్రారంభమయింది. నేరేడుచర్ల మండల వ్యాప్తంగా ఉన్న 25 ప్రాధమిక, ప్రాధమికొన్నత, 07 ఉన్నత పాఠశాలలు, 09 ప్రైవేటు పాఠశాలలలో బడి గంట మోగింది. విద్యా సంవత్సరం మొదటి రోజే అమావాస్య కావడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని పాఠశాలలకి పంపడానికి ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా నమోదు అయింది. మరుసటి రోజు కూడా మంగళవారం రావడంతో, బుధవారం నుండి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.






