స్టేడియంలో యోగా దినోత్సవం
15-06-2026 04:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో 12వ అంతర్జాతీయ జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై యోగ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని ప్రతి ఒక్కరు యోగాసనాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.






