సంగారెడ్డిలో జగ్గారెడ్డి భారీ బైక్ ర్యాలీ
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా..
సంగారెడ్డి, జూలై 22 : రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం స్థానిక రామ్ మందిర్ నుండి మొదలుకుని సంగారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీని స్వయంగా జగ్గారెడ్డి ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యాసంస్థలను మూసి వేయించారు.
ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలతో దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి తో పాటు ఆయన సతీమణి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సైతం పాల్గొన్నారు.






