చోరీ కేసు ఛేదించి బాధితులకు న్యాయం చేయాలి
ముకరంపుర, జూలై 22(విజయ క్రాంతి) మంగళవారం రాత్రి కరీంనగర్ లో భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం చౌరస్తా వద్దగల ఒక ఇంట్లో దొంగలు చొరబడి కుటుంబ సభ్యులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు.ఈ విషయం తెలిసిన వెంటనే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు బుధవారం దోపిడీ జరిగిన ప్రదేశానికి వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించి వెంటనే కరీంనగర్ సీపీ తో ఫోన్లో మాట్లాడారని పేర్కొన్నారు. దొంగలను కచ్చితంగా పట్టుకుని, ప్రజల సొత్తును రికవరీ చేస్తారన్న పూర్తి విశ్వాసం మాకు ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి రేణుక- శ్రీనివాస్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






