8 June, 2026 | 4:54 AM

కల్కి భగవాన్ కల్యాణోత్సవంలో జగ్గారెడ్డి

08-06-2026 01:02 AM

సంగారెడ్డి, జూన్ 7 : సంగారెడ్డి పట్టణం లో పిఎస్‌ఆర్ గార్డెన్ లో  కల్కి భగవాన్ భక్త బృందం ఆధ్వర్యం లో కల్కి భగవాన్   మూర్తులకు  కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు.  కల్కి భగవాన్ దంపతుల విగ్రహ మూర్తులకు పూలమాలలు సమర్పించారు. ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కల్కి భగవాన్ కృపా కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని , ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని ఆకాక్షించారు. 

ప్రతీ ఏటా క్రమం తప్పకుండా కల్యాణం నిర్వహిస్తున్న కల్కి భగవాన్ భక్త బృందాన్ని ఆయన అభినందించారు.కల్కి భగవాన్ ఆలయ కోసం స్థలాన్ని సేకరించామని , ఆలయ నిర్మాణానికి  ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.  ఆలయ నిర్మాణం కోసం తన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా కల్కి భక్త బృందానికి జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కల్కి భక్త బృంద సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.