07-02-2026 01:15:46 AM
ముంబై, ఫిబ్రవరి 6 : టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా మెగాటోర్నీకి దూరమయ్యారు. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 16 పరుగులు ఇచ్చాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు రెండుసార్లు రనప్ ఆపాడు.
తీవ్రమైన మోకాలి నొప్పితోనే మై దానాన్ని వీడాడు. తర్వాత వైద్యులను సంప్రదించగా స్కానింగ్ తీసారు. రాణా కుడి మో కాలి జాయింట్ దగ్గర సమస్య ఉన్నట్టు తే లింది. దీంతో డాక్టర్ల సూచన మేరకు అతన్ని వరల్డ్‌కప్ నుంచి తప్పించినట్టు బీసీసీఐ తెలిపింది. హర్షిత్ రాణా స్థానంలో హైదరా బా దీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కింది. త్వరలోనే సిరాజ్ జట్టుతో కలవనున్నాడు. నిజానికి టీ20 ఫార్మాట్‌లో చాలా రోజుల నుంచి సిరాజ్‌ను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.
టెస్ట్, వన్డేల్లో మాత్రమే అవకాశాలిస్తుండగా.. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం తో తప్పుకోవడంతో సిరాజ్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సిరాజ్ సభ్యుడిగా ఉన్నా డు. ఇప్పు డు టీ20 జట్టులోకి చాలా రోజు ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే హర్షిత్ రా ణా దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బగా చెప్పారు. లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేసే సత్తా కూడా ఉండడమే దీనికి కారణం. టీ20 ఫార్మాట్ లో సిరాజ్ ఇప్పటి వరకూ 16 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసాడు.