మహిళా బిల్లుకు అడ్డుపడిందే కాంగ్రెస్
జీహెచ్‌ఎంసీలో డీలిమిటేషన్ మాన్యూప్యూలేటింగ్ చేసింది మీరు కాదా?
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహిళా బిల్లును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ప్రవేశపెట్టి ముందుకు పోకుం డా అడ్డుపడిందని, కాంగ్రెస్ హయాంలో డీలిమిటేషన్‌లో 7 సీట్లు పెంచితే, దక్షిణ భా రతదేశంలో కేవలం ఒక్కసీటు పెంచారని బీజేపీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దక్షిణభారత్‌కు నష్టంచేసిందే కాంగ్రె స్, దాని మిత్రపక్షాలని ఆరోపించారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడి యాతో మాట్లాడారు. ప్రధాని మోదీ 2023 లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి అందరినీ ఒప్పించారని, అప్పుడు కాంగ్రెస్, డీఎంకేలు డీలిమి టేషన్‌కు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. కుల పరంగా సెన్సెస్ కావాలని డిమాండ్ చేసి సెన్సెస్‌ను డిలే చేశారని, ఇది పూర్తి కావాలంటే 2037 వరకు సమయం పడుతుందన్నారు. ఆలస్యమవ్వొద్దనే డీలిమిటేష న్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టారన్నారు.
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ఏడు అభ్యంతరాలు లేవనెత్తిందన్నారు. దక్షిణ భార త దేశానికి నష్టం, ఎంపీ స్థానాల్లో తగ్గుదల, ఓబీసీలకు నష్టం ఇప్పుడే గుర్తుకొ చ్చిందా? అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో డీలిమిటేషన్ మాన్యూప్యూలేటింగ్ చేసింది మీరు కాదా? అన్నారు. హిందూ కార్పొరేటర్లు ఉన్నచోట 50వేల ఓట్లతో ఒక్క డివిజన్ చేస్తే ముస్లిం కార్పొరేటర్ ఉన్న చోట 30వేలకే డివిజన్ చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ తప్పిదాలను బీజేపీపై రుద్దొద్దని ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.






