8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ముస్తాబాద్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు

08-07-2026 06:43 PM

* వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులు.

* మండల అధ్యక్షుడు గజ్జల రాజు

ముస్తాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకొని రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ,విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి,వారి సంక్షేమమే ద్యేయంగా కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడిని కొనియాడారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకున్నా వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రజల హృదయాల్లో నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.