8 July, 2026 | 8:01 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

పారమితలో విద్యార్థుల హౌస్ ప్రారంభోత్సవం

08-07-2026 06:53 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోటలో పారమిత ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హౌస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమాలను పాఠశాలల అధినేత డా.ఇ.ప్రసాదరావు  ప్రారంభించారు. పాఠశాల క్రమశిక్షణలో భాగంగా ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్దులలో నైపుణ్యాలు, భాద్యతాయుత భవిష్యత్తుకు తగిన విధంగా హౌస్ సిస్టం ద్వారా  విద్యార్థులను  చీతాస్, ఈగల్స్,  టైగర్స్, లయన్స్, అనే పేర్లతో గ్రూపులుగా సిద్దం చేసి ఒక్కొక్క గ్రూపుకు ఒక విద్యార్థి నాయకున్ని ఎంపిక చేసి విద్యార్డుల్లో పోటీతత్వాన్ని పెంచే కార్యక్రమాన్ని పాఠశాలల అధినేత డా. ఇ.ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావు మాట్లాడుతూ... ప్రతి విద్యాసంవత్సరం విద్యార్థులు బృందాలుగా ఏర్పడి విద్యా విషయాలలో గాని, ఆట, పాటల విషయాలలో గాని, సాంస్కృతిక అంశాలలో గాని పోటీపడం, తద్వారా  విద్యార్థులలో  క్రమశిక్షణ, పట్టుదల, పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకుని వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది అన్నారు.