8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ఎస్ఐఅర్ పై బీఎల్ఓలు, పార్టీల ప్రతినిధుల సమావేశం

08-07-2026 06:48 PM

బేల,(విజయక్రాంతి): మండల ఎంఆర్ఓ కార్యాలయంలో బీఎల్ఓలు (Booth Level Officers) వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్వపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, కొత్త ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామా మార్పులు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు తదితర అంశాలపై అధికారులు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ఓటరు జాబితా రూపొందించేందుకు బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.