8 July, 2026 | 7:51 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ఘనంగా డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

08-07-2026 06:46 PM

-  రైతు పండుగగా నిర్వహణ

- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ నేతృత్వంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

తదనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని రైతు పండుగగా నిర్వహించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా రైతులు అభినందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచివున్నాయని తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా, సాగునీటి సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.