8 July, 2026 | 8:06 PM

Breaking News

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •  

ఘనంగా గోదావరి హారతి

20-04-2026 01:29 AM

భద్రాచలం, ఏప్రిల్ 19,(విజయక్రాంతి): భద్రాచలం గోదావరి మాత నదిహారతి పురోహితులు మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్ అన్నారు.  ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో ప్రతి ఆదివారం గోదావరి నదికి భక్తుల సహాయ సహకారాలతో భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు.

అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి  అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన చేసిన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న.

ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు. అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, చావ లక్ష్మీనారాయణ దంపతులు మరియు బూసి రెడ్డి అంకిరెడ్డి ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం నైవేద్యం భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ వర్మ, రామాచార్యులు, తేజ శర్మ, ప్రసాద్ శర్మ, ఫణి కుమార్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.