20 April, 2026 | 10:38 AM

ఇసుక అక్రమంగా తరలిస్తున్న 3 లారీలు పట్టివేత

20-04-2026 01:31 AM
  1. అక్రమ ఇసుకపై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం 

పోలీస్ స్టేషన్‌కు తరలించిన లారీలు 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 19, (విజయక్రాంతి): అక్రమంగా ఇసుకపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వివరాల్లోకి వెళితే పాల్వంచ మండల పరిధిలోని తోగ్గూడం గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు నమ్మదగిన సమాచారం అందింది.

దీంతో తాసిల్దార్ దారా ప్రసాద్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్ చేశారు. పట్టుకున్న లారీలను పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు.