8 July, 2026 | 7:36 PM

నీటి వాడకంపై ప్రజలకు అవగాహన

08-07-2026 07:06 PM

కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామంలో జల్ జీవన్ హర్ గర్ జల్ విభాగం వారు బుధవారం నిర్వహించిన మంచినీటి స్వచ్ఛత వర్షాకాలంలో పాటించవలసిన నియమాలు నీటిని పొదుపుగా వాడుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, ఏఈ రవి కుమార్, సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి వార్డు మెంబర్లు వనపర్తి పిచ్చయ్య, శీలం నాగమణి మరియు పత్తిపాక వెంకటేశ్వర్లు, గద్దల వెంకటేశ్వర్లు , గ్రామపంచాయతీ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్నారు.