దిగొచ్చిన పసిడి ధరలు
- తులంపై రూ.2వేలు డౌన్
- హైదరాబాద్‌లో ధర రూ.1.47,100
న్యూఢిల్లీ, జూన్ 24: అమెరికా డాలర్ విలువ పెరగడం, ఆ దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయనే అంచనాల కారణంగా బంగారం ధరలు క్షీణించాయి. దీంతో బుధవారం బంగారం, వెండి ధరలు పతనమ య్యాయి. పసిడి ధర రూ.1,834 తగ్గి, మూ డు నెలల కనిష్ట స్థాయికి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎగ్స్)లో 9,508 లాట్ల వ్యాపార పరిమాణంతో ఈ పసిడి ధర 10 గ్రాములకు రూ.1,834 లేదా 1.25 శాతం తగ్గి రూ.1,44,695 వద్ద నమోదైంది.
హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్‌లో బుధవా రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2000 తగ్గి, రూ.1.47,100కి చేరింది. కిలో వెండి ధర దాదాపు రూ.4వే లు తగ్గి రూ.2.29లక్షలు పలికింది. అమెరికాలో కఠినమైన ద్రవ్య విధానం అమలు లోకి రానుందనే అంచనాలతో డాలర్, ట్రె జరీ బాండ్ రాబడులు పెరగడం, దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచిందని, దీంతో గిరాకీ తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఒకవైపు అమెరికా డాలర్ బలపడటం, మరోవై పు ఫెడరల్ రిజర్వ్ విధానాలపై నెలకొన్న ఆందోళనల కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. ఈ పరిణామాలు పసిడికి డిమాండ్‌ను తగ్గించాయ ని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ తెలిపారు. ‘అమెరికా, -ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, కొనసాగుతున్న అనిశ్చితి వల్ల ప్రపం చ మార్కెట్లలో బంగారం ధరలు పతనాన్ని కొనసాగిస్తున్నాయి అని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాని అన్నారు.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు ఎనిమిది నెలల కాలంలోనే మొదటిసారిగా బం గారం ఫ్యూచర్స్ ధరలు ఔన్స్ ధర 4,100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయా యి. కామెక్స్‌లో ఈ లోహం ధర ఔన్స్‌కు 51.55 డాలర్లు లేదా 1.24 శాతం తగ్గి 4,097.85 డాలర్లకు చేరింది.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ఫ్యూ చర్స్ ట్రేడింగ్‌లో వెండి ధర కిలోకు రూ. 2.26 లక్షలకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, జూలై డెలివరీకి సంబంధించిన వెండి ధర రూ.527 (అంటే 0.23 శాతం) పెరిగి కిలోకు రూ.2,26,361కి చేరింది. ఈ క్రమంలో 4,081 లాట్ల మేర లావాదేవీలు జరిగాయి.






