వార్డు సభలో సమస్యలు పరిష్కారం
08-06-2026 05:19 PM
డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మున్సిపల్ వార్డు సభలలో స్థానిక సమస్యలు వెంట పరిష్కారానికి కృషి చేస్తున్నామని 11వ వార్డు కౌన్సిలర్, డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై వెంటనే చర్య తీసుకోవాలని సత్యం మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ ,నాయకులు జమాల్, ఎంసి గంగాధర్ ,వార్డ్ ఆఫీసర్ రామకృష్ణ ,మున్సిపల్ సిబ్బంది ధీరజ్, టిపిఓ ఆశీస్, వెంకన్న, చేతన్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు విజయ ,మెప్మా ఆర్పి రామలక్ష్మి, సునీత ,పలువురు కాలనీవాసులు ఉన్నారు.






