16 March, 2026 | 3:49 AM

మొజ్తాబా ఉన్నాడోలేడో?

16-03-2026 12:59 AM
  1. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మరణించినట్లు వార్తలు విన్నా 
  2. సరదా కోసం ఖర్గ్‌పై మరిన్ని దాడలు చేస్తాం
  3. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్, మార్చి 14 : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నా రు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడో లేడో తెలియదని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు ఏవీ కన్పించడం లేదని ట్రంప్ అన్నారు.

అయితే మొజ్తాబా ప్రాణాలతో లేడని తాను విన్నానని, ఒకవేళ ఆయన బతికే ఉంటే తన దేశం కోసం లొంగిపోవడం లాంటి ఏదైనా తెలివైన నిర్ణయం తీసుకునేవాడని పేర్కొన్నారు. కాగా మొజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తా యి. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, కాలు పోయిందని ప్రచారం జరిగింది.

అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇరాన్ ఇంధన గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపం పై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లు సరిగ్గా లేవని విమర్శించారు. ఖర్గ్‌లోని చాలా ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశామని, తమ వినోదం కోసం మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ అన్నారు.