17-02-2026 01:23:16 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నిరూపించాయని, మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గత 12 ఏండ్లుగా బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీకి బీ- అని కాంగ్రెస్, కాంగ్రెస్‌కి బీ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అని, ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించాయని మండిపడ్డారు.
బీజేపీతో కలిసి సింగిల్ టీమ్‌గా మారిపోయిందని, ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని, కేవలం బీఆర్‌ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయని విమర్శించారు.
ఢిల్లీలో కొట్టుకున్నట్టు.. గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటా లు వేసుకొని పదవులు పంచుకుంటున్నారని, దీనికి అలియాబాద్, అమన్‌గల్, మెద క్, నర్సాపూర్ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పా ర్టీకి ఒంటరిగా బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కైందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాహు ల్ గాంధీ, కాంగ్రెస్ ఏమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే..
ఇక్కడ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీతో జత కడుతున్నదని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అం టుంటే ఇక్కడ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏమో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని నిరూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ ము న్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్‌చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని చూడలేక కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఓటింగ్‌కి దూరంగా ఉన్నామని స్పష్టం చేశా రు. క్యాతనపల్లి, తొర్రూరు, జనగామ, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ కు ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టినప్పటికీ.. అక్కడ ప్రజాతీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చైర్మన్ పీఠాలను హైజాక్ చే యాలని చూస్తున్నారని ఆరోపించారు. కాం గ్రెస్ ముసుగులో బీజేపీ, బీజేపీ ముసుగు లో కాంగ్రెస్ పనిచేస్తున్నాయన్నారు.