calender_icon.png 17 February, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

17-02-2026 01:21:54 AM

  1. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇప్ప ఉమారాణి 
  2. వైస్ చైర్ పర్సన్‌గా కాసర్ల గోదావరి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఎట్టకేలకు కామారెడ్డి  మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బిఆర్‌ఎస్ మద్దతుతో చైర్పర్సన్ గా కాంగ్రెస్కు చెందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక కాగా,  వైస్ చైర్పర్సన్ గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు.  ఇచ్చే పుచ్చ ధోరణితో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు  వ్యవహరించాయి. 19 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఇండిపెండెంట్గా గెలిచిన ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్లో చేర్చుకున్నారు.

మరో నలుగురి కౌన్సిలర్ లు కాంగ్రెస్కు మద్దతు చెప్తేనే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుని అవకాశం ఉండడంతో, కాంగ్రెస్ పార్టీ పెద్దలు టిఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించి చైర్మన్ కు మద్దతిస్తే వైస్ చైర్మన్ తమ పార్టీకిచ్చి మద్దతు ఇవ్వాలని ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. రెండు రోజులపాటు ఉత్కంఠ గా ఉన్న కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ ఎట్టకేలకు చేజిక్కించుకుంది. 11 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన బిఆర్‌ఎస్ పార్టీ కీలకంగా మారింది.

బిజెపి కి 16 కౌన్సిలర్ స్థానాలను గెలిచిన పూర్తి మెజార్టీ లేకపోవడంతో టిఆర్‌ఎస్ మద్దతు కోసం బిజెపి పార్టీ ప్రయత్నించింది. బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు సస్యమేరా అనడంతో బిజెపి ఒంటరిగానే చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానానికి పోటీ చేయగా మెజార్టీ ఓట్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. బి ఆర్ ఎస్ కు చెందిన కాసర్ల గోదావరి వైస్ చైర్మన్ గా ఎన్నికయింది.

38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన  ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్లో చేరడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చేందుకు టిఆర్‌ఎస్ నాయకులు సుముకుత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ఇప్ప ఉమారాణి  తో పాటు 49 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకొని ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎన్నికల ఇన్చార్జి జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ మధు మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి    ఇషాక్ షేక్  ఉమారాణిని చైర్ పర్సన్ గా ప్రతిపాదించగా కాంగ్రెస్ కౌన్సిలర్ అంజాద్ బలపరచగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ అభ్యర్థులు సంపూర్ణ మద్దతు తెలిపి ఉమారాణిని చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. బిజెపి చైర్ పర్సన్ గా  బరిలో దిగిన సుజిత ను బిజెపి కౌన్సిలర్ గా గెలుపొందిన  ప్రీతి గొరవత్ ప్రతిపాదించగా, 11వ వార్డు  బీజేపీ కౌన్సిలర్ కాసర్ల రాణి బలపరిచారు.

కాగా ఆమెకు  కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి,16 మంది బీజేపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వగా  సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో  కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి చైర్పర్సన్ గా గెలుపొందారు.  వైస్ చైర్మన్ గా కాసార్ల గోదావరిని 45వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి పిట్ల వేణు ప్రతిపాదించగా 18 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ హఫీజ్ బేగ్ ప్రతిపాదించగా, బిజెపి నుండి  వైస్ చైర్మన్ బరిలో మోటూరి శ్రీకాంత్ ను బిజెపి కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ ని బలపరచగా కుంట లక్ష్మారెడ్డి ప్రతిపాదించారు. కాగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా కాసర్ల గోదావరికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలపడంతో  వైస్ చైర్ పర్సన్  టిఆర్‌ఎస్ అభ్యర్థి కాసర్ల గోదావరి వైస్ చైర్మన్ గా  ఎన్నికయ్యారు.

 కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్  మద్దతు:

 క్యాంపు రాజకీయాల్లో భాగంగా  బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన లక్ష్మీనారాయణ తమ పార్టీ అధిష్టానం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుందో  ఆ పార్టీకే తమ మద్దతుని ఇస్తామని తెలుపడం తో  కామారెడ్డి లో మరోసారి కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పొత్తు బయటపడింది. ఎన్నికల ముందు మాటల యుద్ధం కురిపించుకునే పార్టీలు  కామారెడ్డి లో రెండు ఒకటి కావడంతో  ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఏది ఏమైనప్పటికి  కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇటీవల  స్వతంత్ర అభ్యర్థిగా ఆపిల్ గుర్తు నుండి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వాతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయగా, వైస్ చైర్ పర్సన్ గా కాసర్ల గోదావరి లు ఎన్నికయ్యారు.

కామారెడ్డి మున్సిపల్ లో మొత్తం 49 కౌన్సిలర్లు ఉండగా, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్ పర్సన్ గా కాసర్ల గోదావరి తో పాటు  49 మంది కౌన్సిలర్లుగా  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణిని, వైస్ చైర్ పర్సన్ గా కాసర్ల గోదావరి ఇలా ఎన్నిక జరిగింది. అనంతరం వారు చైర్ పర్సన్ గా, వైస్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేశారు.

అంబరాన్ని అంటిన సంబరాలు :

కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో  కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  అనుచరులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు. వైస్ చైర్ పర్సన్ ను బిఆర్‌ఎస్ కు చెందిన కాసర్ల గోదావరి స్వామి ఎన్నిక కావడంతో వారి అనుచరులు టాపాకాయలు కాల్చి, స్వీట్లు పంచే సంబరాలు చేశారు.