09-02-2026 04:29:23 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరిచి ఘన విజయం సాధించారు. హైదరాబాద్ లో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు గెలుచుకుని పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు.
ఈ పోటీల్లో ఎం.కృతిక (3వ తరగతి) జూనియర్ విజువలైజేషన్ కేటగిరీలో ఛాంపియన్ అవార్డుతో మొదటి స్థానం, ఎం. రితన్య (6వ తరగతి) సీనియర్ అబాకస్ జీనియస్ అవార్డులో మూడవ స్థానం, హన్విక (5వ తరగతి) సీనియర్ అబాకస్ రైజింగ్ స్టార్ విభాగంలో నాలుగో స్థానం,మాన్విత (1వ తరగతి) స్టార్ జూనియర్ అబాకస్ జీనియస్ అవార్డులో మూడవ స్థానం దక్కించుకున్నారు.ఈ సందర్భంగా విజేతలను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం విద్యార్థులను అభినందించారు.