23 May, 2026 | 2:56 AM

ఉప్పల్‌లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా

23-05-2026 12:42 AM

హైదరాబాద్, మే 22 : సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపింది. స్టేడి యం బయట పలువురు కేటుగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన కాంప్లిమెంటరీ టికె ట్లు విక్రయిస్తూ పట్టుబట్టారు.

ఆర్సీబీతో మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను ఇటు సైబర్ నేరగాళ్లు, అటు బ్లాక్ మార్కె ట్ ముఠాలు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో గత రెండు మూ డు రోజులుగా పోలీసులు అభిమానులను హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం స్టేడియం పరిసరాల్లో నిఘా పెం చారు. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ పా సులను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ సుమతి ఆదేశాలతో ఉదయం నుంచే స్టేడియం దగ్గర బ్లాక్ మార్కెట్ దం దాపై నిఘా ఉంచారు.

ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యా జమా న్యం కూడా ఐపీఎల్ టికెట్ల ధరలను భారీగా పెంచింది. అంత ధరలు పెట్టలేక, మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు ప్రయత్నిస్తోన్న అభిమానులను ఆసరాగా చేసుకు ని బ్లాక్‌లో టికెట్లు విక్రయించేందుకు పలువురు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.