గాయంతో రఘువంశీ ఔట్
కోల్‌కతా, మే 22 : ఐపీఎల్ 2026 సీజన్ లో ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్ రై డర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం తో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్రిష్క్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియ న్స్‌తో మ్యాచ్ సందర్భంగా చేతి వేలికి ఫ్రాక్చ ర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉం డడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యా చ్‌కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది. కేకేఆర్ ఈ సీజన్ ఆరంభం లో వరుస ఓటములతో డీలా పడింది.
సెకండాఫ్‌లో వరుస విజయాలతో మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఆరో స్థానం లో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న పంజాబ్ ౫వ స్థానంలో ఉండగా, రాజస్తాన్ ౪వ స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్, రాజస్తాన్లు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోయి, కేకేఆర్ త మ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ప్లేప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రఘువంశీ దూరమవ్వడం ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.






