చెన్నై సూపర్ కింగ్స్‌కు జరిమానా
స్లో ఓవర్ రేట్‌పై చర్యలు
ముంబై, మే 22 : ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా నే ఇంటిదారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చిత్తుగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది 8వ ఓటమి. దీంతో లీగ్ స్టేజ్‌లోనే సీఎస్కే కథ ముగిసినట్టయింది.
అసలే ఓటమి బాధలో ఉన్న చెన్నై జట్టుకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జట్టు ఆటగాళ్లందరికీ జరిమానా వి ధించారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై నిర్ణీ త సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో ఈ తప్పిదానికి పాల్పడడం సీఎస్కేకు ఇది రెండో సారి. దీంతో ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.24 ల క్షల జరిమానా విధించారు.
అలాగే ఇంపాక్ట్ ప్లేయర్లతో సహా తుది జట్టులోని ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఈ రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది జరిమానా గా విధించారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలే సాధించి ఎలిమినేట్ అయింది. ధోనీతో పాటు పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడం సీఎస్కే అవకాశాలను దెబ్బతీసింది.






