calender_icon.png 23 February, 2026 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మ వార్షికోత్సవాలకు ఆహ్వానం

23-02-2026 10:33:27 AM

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొండంరాజ్‌పల్లి గ్రామంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును(MLA Harish Rao) గ్రామస్తులు,అంబేద్కర్ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నారోజు బ్రహ్మచారి, మ్యాక కనకయ్య, గ్రామస్తులు ముంగి చంద్రం, మైసయ్య, రజనీకాంత్, అనిల్, కనకయ్య, బాలు, కరుణాకర్, బాపురాజు,నవదీప్, సంపత్,సాగర్ తదితరులు ఉన్నారు.