calender_icon.png 23 February, 2026 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడీ దొంగల బీభత్సం

23-02-2026 10:31:48 AM

10 తులాల బంగారం, రూ :1, 30,000 నగదు అపహరణ 

దమ్మపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో శనివారం రాత్రి దోపిడీ దొంగలు పది తులాల బంగారం, రూ.1,30,000 నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి(Dammapeta SI Sai Kishore Reddy) తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండల పరిధిలోని రామచంద్రాపురం  గ్రామానికి చెందిన కంభంపాటి  గురునాధం అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజ్ లు ధరించి గురునాధం  ఇంట్లోకి ప్రవేశించి భార్యా భర్తలు ఇద్దరినీ తాళ్లతో కట్టివేసి, చంపుతామని బెదిరించి, బీరువా తాళాలు తీసుకుని, బీరువాలోని పది తులాల బంగారం, రూ.1, 30,000/-ల నగదును అపహరించుకుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి , సిబ్బంది సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లి పరిశీలించారు. దోపిడీ దొంగలు ఇంటి వెనుక వైపు నుండి లోనికి ప్రవేశించి ఉంటారని, ఇది తెలిసిన వాళ్ళ పని అయ్యుంటుందని, లేకపోతే వెనుక భాగంలో మామిడి, పామాయిల్ తోట, ఫెన్సింగ్ దాటి లోనికి ఎలా వస్తారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని, గురునాధం భార్య ఉదయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .