17 June, 2026 | 8:38 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

కుల ధృవీకరణ పత్రాలపై విచారణ

11-03-2026 05:30 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాల విషయంపై బుధవారం మంగపేట తహశీల్ కార్యాలయంలో తహశీల్దార్ తోట రవీందర్ విచారణ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు... మల్లూరు గ్రామానికి చెందిన అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ, అనిపెద్ది మురళీ మోహన్ శర్మ అనే నలుగురు వ్యక్తులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందారు.

వాటిని రద్దు చేయాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన కైంకర్యం రాఘవాచార్యులు మంగపేట తహసీల్ కార్యాలయంలో డిసెంబర్ 29 న, జిల్లా కలెక్టర్ కు జనవరి 9న ఫిర్యాదు చేశారు. దీంతో మంగపేట తహశీల్దార్ తోట రవీందర్ బుధవారం మంగపేట తహసీల్ కార్యాలయంలో విచారణ చేశారు. విచారణలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు, భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం  స్థానాచార్యులు కోమాండూరు ఇళైవిల్లి స్థల శాయి, ఉప ప్రధాన అర్చకులు  కోటి శ్రీమన్నారాయణాచార్యుల ద్వారా వివరాలు తెలుసుకుని వాంగ్మూలం తీసుకున్నారు.

2017 నవంబర్ 16వ  తేదిన మల్లూరు గ్రామానికి చెందిన వై.ఈశ్వర్ చంద్ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో ప్రధమ శాఖ నియోగి , ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో నియోగి, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ అనే వ్యక్తి 2018 ఫిబ్రవరి 21న బ్రాహ్మణ కులంలో నియోగి అని కుల ద్రువీకరణ పత్రాలు పొందారని ఫిర్యాదుదారుడు కైంకర్యం రాఘవాచార్యులు ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు చూపించారు. అదే ముగ్గురు వ్యక్తులలో వై.ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే ఇద్దరు 2025 నవంబర్ 28న, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ 2025 నవంబర్ 25న, అనిపెద్ది మురళీ మోహన్ శర్మ 2025 డిసెంబర్ 18న  బ్రాహ్మణ కులంలో శ్రీ వైష్ణవ అని కుల ధృవీకరణ పత్రాలు పొందారని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు చూపించారు.

ఈ విషయంపై  తహశీల్దార్ తోట రవీందర్ ను వివరణ అడుగగా ఫిర్యాదుదారుడు కైంకర్యం రాఘవాచార్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, విచారణలో వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, అనిపెద్ది మురళీ మోహన్ శర్మలు తప్పుడు సమాచారంతో కుల ధృవీకరణ పత్రాలు పొందారని తేలితే అట్టి కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేస్తామని, అట్టి కుల ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఎండోమెంట్ శాఖకు తెలుపుతామని, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి కుల ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.