11 March, 2026 | 11:07 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ సద్వినించుకోండి

11-03-2026 05:26 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై రేపు, ప్రజా ప్రతినిధులకు ఏర్పాటు చేయనున్న అవగాహన సదస్సులను ప్రజా ప్రతినిధులు సద్వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రత్యేక ప్రణాళికపై పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్  పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలవారీగా కౌన్సిలర్లకు, మండలాల వారీగా సర్పంచ్ లకు సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాన్ని నిర్ణిత సమయానికి ప్రారంభించి, సాఫీగా కొనసాగించాలన్నారు. సరైన లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు త్రాగునీరు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు.

వాహనాలకు తగిన పార్కింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భోజనశాలను పరిశీలించారు. సమావేశానికి హాజరయ్యే వారికి, మంచి ఆహారం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.