27 July, 2026 | 4:54 PM

ఐఎన్‌టీయూసీ కోర్ కమిటీ సమావేశం

27-07-2026 04:19 PM

హాజరైన ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్

సత్తుపల్లి, జులై 27(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన గోదావరిఖనిలో సోమవారం సింగరేణి ప్రస్తుత పరిస్థితులు , నూతన బొగ్గు గనుల సాధన , పెండింగ్ హామీల అమలు , 12వ జెబిసిసిఐ వేజ్ బోర్డు ఏర్పాటు అంశాలపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ నాయకులు ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ , సింగరేణి 12 ఏరియాలో వైస్ ప్రెసిడెంట్లు , కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని బొగ్గు బ్లాకులను సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అలాగే కార్మికుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు.అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పెండింగ్ హామీల అమలు , ఆదాయప్పన్ను రాయితీ , సొంత ఇంటి పథకం అమలు, మారుపేర్లు మరియు విజిలెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం , నూతన బొగ్గు గనుల కేటాయింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

సింగరేణి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, సంస్థ విస్తరణ, ఉద్యోగ అవకాశాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కార్మిక సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం, గనుల్లో భద్రతా ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.అలాగే యూనియన్ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం , హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాసభలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించడం , అన్ని ఏరియాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించడం , ప్రజాప్రతినిధులు , కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్లడం వంటి పలు కీలక అంశాలపై పూర్ కమిటీలో చర్చించారని తెలియజేశారు.కోర్ కమిటీ సబ్యులు త్యాగరాజన్ , ఆల్బర్ట్ , రజాక్ , పితాంబర్రావు , కృష్ణంరాజు , కోటేశ్వరరావు పాల్గొన్నారు.