నూతన స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
27-07-2026 04:47 PM
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండల కేంద్రంలో గ్రామ క్రీకారులందరు స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. స్థానిక క్రీడాకారులు రాకేష్, వెంకటేష్,యాకూబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు అందర్నీ సమన్వయపరిచి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఓరగంటి వెంకటేష్ ఉపాధ్యక్షులుగా నక్క యాకూబ్ ప్రధాన కార్యదర్శిగా మేడిశెట్టి శ్రీహరి జాయింట్ సెక్రటరీగా గుగ్గిళ్ళ సాగర్, క్యాషియర్ గా గొల్లపల్లి రాంబాబులను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో గ్రామంలో యువకులు అందరిని ఆటలవైపు నడిపించి ప్రతి సందర్భంలో వివిధ క్రీడల టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.






