27 July, 2026 | 5:55 PM

వాడి గ్రామంలో బోర్ వెల్ రీఛార్జ్ పిట్ ఏర్పాటుకు మార్కౌట్

27-07-2026 04:54 PM

నాగిరెడ్డిపేట్,జులై 27 (విజయక్రాంతి): మండలంలోని వాడి గ్రామంలో జలసిరి పథకంలో భాగంగా బోర్వెల్(borewell) రీఛార్జ్ పిట్ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ మహేందర్ గ్రామస్తులతో కలిసి మార్కౌట్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ...వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ వ్యవసాయ భూమి వద్ద ఉన్న బోరు బావి వద్ద పంటకుంటను ప్రతి రైతు ఏర్పాటు చేయాలని తెలిపారు.గ్రామంలో ప్రతి ఒక్కరు తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు.అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద వర్షం నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంత నిర్మించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్,కార్యదర్శి సంజీవులు,ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.