27 July, 2026 | 5:37 PM

మౌఖిక డిప్యూటేషన్లు రద్దు చేయాలి

27-07-2026 04:45 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా దస్తరుబాదు మండల్ ఖానాపూర్ కుంటాల కుబీర్ ముధోల్ బైంసా మండలాలలో జరుగుతున్న అక్రమ మౌఖిక డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జీవో ఎంఎస్ నెంబర్ 25 ప్రకారం డిప్యూటేషన్లను కలెక్టర్ అనుమతి తోటి ఇవ్వాల్సి ఉండంగా జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇతర అవసరమున్న పాఠశాలల్లో డిప్యూటేషన్లను జిల్లా విద్యాధికారి నిబంధనల ప్రకారం చేయాల్సి ఉన్న నెలరోజులుగా డిప్యూటేషన్లు ఇవ్వకపోవడంతోటి డిప్యూటేషన్ల జాబితాను తయారు చేయకపోవడంతోటి ఆయా మండల విద్యాశాఖ అధికారులు ఇష్టారించిన డిప్యూటేషన్లను ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు నష్టం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు