27 July, 2026 | 5:41 PM

కన్నుల పండుగగా విశ్వశాంతి మహాయాగ మహోత్సవం

27-07-2026 04:49 PM

హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు

కల్వకుర్తి జులై 27 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం(Vishwashanti Mahayagam) సోమవారం ఆధ్యాత్మిక వైభవంతో, కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి రుద్రసహిత మృత్యుంజయ, పశుపతాస్త్ర, చంద్రగ్రహ హోమాలను వేదపండితులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.

నిరంతరాయంగా జరుగుతున్న హోమాలు, ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాగశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ప్రతిరోజూ ఐదు నుంచి పది వేల మందికి పైగా భక్తులు పాల్గొని పూజల్లో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన సతీమణితో కలిసి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానంద స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పలువురు నాయకులు మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదం తదితర సౌకర్యాలను కల్పిస్తూ మహాయాగాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.