గోపాల్పేట్ రైతు వేదికలో విత్తన మేళా
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట రైతు వేదికలో విత్తనమేళ నిర్వహించడం జరిగింది. ఎల్నినో ప్రభావం వలన వర్షపాతం తక్కువ నమోదు అవుతున్న తరుణంలో అరుతడి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించడం జరిగింది. అరుతడి పంటలు అంటే తక్కువ నీటితో, ప్రధానంగా వర్షపాతంపై ఆధారపడి సాగుచేసే పంటలు. ఇవి ఎండను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండి, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయనీ ఏవో సాయికిరణ్ తెలిపారు.
వానాకాలంలో సాగు చేసే ముఖ్యమైన అరుతడి పంటలు కంది, పెసర, మినుము, ఉలవలు, వేరుశెనగ, నువ్వులు, జొన్న, సజ్జ, రాగులు, ఆముదంలు తక్కువ నీటితో సాగు చేయవచ్చు.ఎండ పరిస్థితులను బాగా తట్టుకుంటాయి.సాగు ఖర్చు తక్కువగా ఉంటుంది.పప్పుధాన్య పంటలు నేలలో నత్రజనిని పెంచి నేల సారాన్ని మెరుగుపరుస్తాయి.రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.రైతులకు మినుములు,పెసలు, కందులు,నువ్వులు, మొక్కజొన్న పంటలకు సంబంధించి విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందనీ మండల ఏవో సాయి కిరణ్ తెలిపారు.






