27 July, 2026 | 4:54 PM

పేద విద్యార్థులకు గొడుగుల పంపిణీ

27-07-2026 04:20 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎంపీపీఎస్ చిన్నగూడూరు పాఠశాలలో దివంగత షేక్ దావూద్ వర్ధంతి సందర్భంగా ఆయన మనవడు ఎన్ ఆర్ ఐ అబ్దుల్ కుదూస్ వర్షా కాలాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు గొడుగులను సమకూర్చారు. హెచ్ ఎం లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ ఎన్. రవికుమార్ మాట్లాడుతూ సమాజ సేవ ద్వారా లభించే ఆత్మసంతృప్తి ఏ సంపదతోనూ కొనలేమని పేర్కొన్నారు. తన తాత దివంగత షేక్ దావూద్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అబ్దుల్ కుదూస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహ్మాన్, మిత్ర బృందం పాల్గొన్నారు.