27 July, 2026 | 5:42 PM

డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్

27-07-2026 04:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని కళాశాలలో జూలై 27న ఘనంగా నిర్వహించారు.  కళాశాల ఎన్‌సీసీ విభాగం కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వ ధైర్యసాహసాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా. యు. గంగాధర్, ఏ.ఓ. నాగ శ్రీనివాస్, ఎన్‌సీసీ అధికారి డా. బి. ఉమేష్, డా. కె. సూర్యసాగర్, డా. పి.జి. రెడ్డి, డా. టి. శ్రీనివాస్, డా. ఎం. రజిత, సయ్యద్ హసీబుర్ రహ్మాన్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.