నీటి సరఫరాలో అంతరాయం
11-04-2026 02:10 AM
కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మిషన్ భగీరథ నీటి సరఫరాకు నాలుగు రోజులు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు గమనించాలని మిషన్ భగీరథ ఈ ఈ రమేష్ తెలిపారు. సదాశినగర్ మండలం మల్లుపేట వద్ద మెయిన్ లైన్ మరమ్మతుల కారణంగా ఈనెల 11 నుంచి 14 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలాలకు నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజు విడిచి రోజు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయడం జరుగుతుంద నీ తెలిపారు.




