15 June, 2026 | 5:44 PM

అభివృద్ధి ఆయన లక్ష్యం ఉప ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాల అమలు: మార్కెట్ కమిటీ చైర్మన్

15-06-2026 04:24 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎంతగానో శ్రమ పడుతున్నారని ఆయన పుట్టుక తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని బూత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యూసుఫ్ వార్డు సభ్యులు షేక్ షాకీర్ శేఖర్ షేక్ నాజర్ అహ్మద్ కౌసర్ అబ్దుల్ హసీఫ్ శంషు సల్మాన్ అబ్రార్ తదితరులు పాల్గొన్నారు