6 May, 2026 | 10:14 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

09-03-2026 03:12 AM

హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రారంభం 

కొడంగల్, మార్చి 8 (విజయ క్రాంతి) : కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ హాజరయ్యారు. కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీందర్ యాదవ్, కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా.శ్రావణి, డా.సాకేత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో మహిళా సిబ్బందిని మున్సిపల్ చైర్మన్ నాందారం ప్రశాంత్ ఘనంగా సన్మానించారు. అనంతరం హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నాందారం ప్రశాంత్ మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ...కొంత వివక్షతకు గురవుతున్నారని అన్నారు. డ్రగ్స్,బాల్యవివాహాలు లాంటి విషయాల వల్ల అప్రమత్తంగా ఉంటూ షీ టీమ్స్ సహకారాన్ని మహిళలు సద్వినీ యోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని సూచించారు. వైద్యురాలు శ్రావణి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హెచ్ పివి టీకాలు ఉచితంగా అందిస్తుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినీయోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ మరి శంకర్ నాయక్ మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.