6 May, 2026 | 9:23 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

అర్హులందరికీ ఇండ్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

09-03-2026 03:13 AM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్  యాదవ్

ఘట్‌కేసర్, మార్చి 8 (విజయక్రాంతి) : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత నివాసం కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని పేదలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకంను ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని మర్పపల్లిగూడ, ఎదులాబాద్ లలో వజ్రెష్ యాదవ్ ఆదివారం పలువురు పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, మండల మాజీ అధ్యక్షులు కర్రే రాజేష్, కీసర దేవస్థానం కమిటీ డైరెక్టర్ సామల అమర్,  నాయకులు కందుల కుమార్, బొక్క ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మేడబోయిన జంగయ్య ముదిరాజ్, మెట్టు నర్సింహా, బొక్క సత్తిరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.