అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
- సీపీ తరుణ్ జోషి
షాద్నగర్ (కేశంపేట), జులై 29 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస నే రాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను కేశంపేట పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణతో కలసి సీపీ వివరాలను వెల్లడించారు.
ఈ నెల 24, 25 తేదీల్లో కేశంపేట మండల పరిధిలోని సంతాపూర్ వద్ద సోమరాజు బాలమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల పుస్తెల తాడును, అలాగే కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ మెడలోని 3 తులాల పుస్తెల తాడును దుండగులు లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. వరి కోతల సమయంలో యంత్రాలపై పని చేయడానికి వచ్చి, వెళ్లే ముందు దొంగతనాలకు పాల్పడటం ఈ ముఠా నైజమని సీపీ తెలిపారు.
సాంకేతిక ప రిజ్ఞానం, నిఘా సమాచారంతో జూలై 29న కేశంపేట ఎక్స్ రోడ్డు సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్/రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన సుఖ్దేవ్ సింగ్ (38), శంషేర్ సిం గ్ (36)లుగా గుర్తించారు. మరో నిందితుడు మన్ప్రీత్ సింగ్ (24) ప్రస్తుతం పరారీలో ఉ న్నాడు. నిందితుల నుంచి బంగారం సుమా రు 7 నుండి 8 తులాల బంగారు గొలుసు లు ఒక బైక్, 5 మొబైల్స్, 2 కత్తులను స్వాధీ నం చేసుకున్నారు. కేశంపేట, కడ్తాల్, కొత్తకోటలో నమోదైన కేసులలో వీరే నింది తులని పోలీసులు నిర్ధారించారు.






