25 July, 2026 | 4:46 AM

సూర్యాపేట కోర్టు చౌరస్తాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

25-07-2026 12:13 AM

సూర్యాపేట, జూలై 24 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సూర్యాపేట టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ పర్యవేక్షణలో సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా వాహన చోదకుల లైసెన్సులు, వాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడడానికే ఈ నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ తనికీలలో పోలీస్ సిబ్బంది పాల్గొనారు.