2 August, 2026 | 11:11 PM

ఆర్కిప్లగ్ ఓయ్‌తో ఇన్ఫిస్టార్ రెన్యూవబుల్స్ భాగస్వామ్యం

03-08-2026 12:00 AM

అహ్మదాబాద్, ఆగస్టు 1, 2026: 

ఫిన్లాండ్‌కు చెందిన ఆర్కిప్లగ్ ఓయ్‌తో ఇన్ఫి స్టార్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రత్యేకమైన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మేక్-ఇన్-ఇండియా మాడ్యులర్ ప్లగ్ ఫ్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ప్రవేశపెట్టనుంది. తదుపరి తరం సీబీజీ పరిష్కారాల ద్వారా దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

ఆర్కి స్టార్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ జాయింట్ వెంచర్, వ్యవసాయ వ్యర్థాలు, పురపాలక ఘన వ్యర్థాలు మరియు ఇతర సేంద్రీయ వ్యర్థాలను స్వచ్ఛమైన శక్తిగా మార్చగల సామర్థ్యం ఉన్న టర్న్‌కీ మేక్-ఇన్-ఇండియా మాడ్యులర్ ప్లగ్-ఫ్లో సీబీజీ ప్లాంట్లను అందిస్తుంది. ఇప్పటికే యూరప్ , ఆసియా అంతటా విజయవంతంగా అమలు చేయబడిన ఈ మాడ్యులర్ టెక్నాలజీ, ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో కూడా మొదటిసారిగా ప్రవేశపెడుతున్నారు. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, భారతదేశం స్వచ్ఛమైన ఇంధనం వైపు తన పరివర్తనను వేగవంతం చేస్తున్న తరుణంలో, ఈ టెక్నాలజీ ఇంధన భద్రత, వాతావరణ మార్పు, వ్యర్థాల నిర్వహణ మరియు నీటి సంరక్షణ వంటి దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు ఆచరణాత్మక మరియు సుస్థిరమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

సంప్రదాయ ప్లాంట్‌లకు సాధారణంగా అవసరమయ్యే 12-18 నెలలతో పోలిస్తే, మాడ్యులర్ సీబీజీ ప్లాంట్‌లను కేవలం 4-5 నెలల్లోనే వేగవంతమైన బయోగ్యాస్ ఉత్పత్తి కోసం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా, సంప్రదాయ వెట్ డైజెషన్ సిస్టమ్‌ లా కాకుండా, ఈ డ్రై అనెరోబిక్ రియాక్టర్‌లకు డైజెషన్ ప్రక్రియలో అతి తక్కువ నీరు అవసరం అవుతుంది, ఇవి సుమారు 30 శాతం తక్కువ ఫీడ్‌స్టాక్‌ను మరియు గణనీయంగా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి, తద్వారా మొత్తం నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించి, వాణిజ్యపరమైన లాభదాయకతను పెంచుతాయి.

ఓపెన్, మాడ్యులర్ సిస్టమ్‌గా రూపొందించబడే ఈ ప్లాంట్లు, నేపియర్ గడ్డి, మున్సిపల్ ఘన వ్యర్థాలు, వరి గడ్డి, ప్రెస్ మడ్, పత్తి అవశేషాలు, పండ్లు మరియు కూరగాయల వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలు, చేపల వ్యర్థాలు మొదలైన 100 కంటే ఎక్కువ రకాల ఫీడ్‌ స్టాక్‌లను ప్రాసెస్ చేయగలవు. ఇది విస్తృత శ్రేణి వ్యవసాయ, పారిశ్రామిక మరియు మున్సిపల్ అనువర్తనాలకు అనువుగా ఉంటుంది.

ఈ జాయింట్ వెంచర్‌ గురించి ఇన్ఫిస్టార్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుహ్రిద్ వి సారాభాయ్ గారు మాట్లాడుతూ “స్వచ్ఛమైన మరియు స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తు వైపు భారతదేశ పరివర్తనకు సుస్థిరమైన, వాణిజ్యపరంగా లాభదాయకమైన మరియు ప్రజలకు అందుబాటులో ఉండే పరిష్కారాలు అవసరం. ఆర్కి ప్లగ్‌తో మా భాగస్వామ్యం ద్వారా, ఇంధన భద్రత, వాతావరణ చర్యలు, వ్యర్థాల నిర్వహణ మరియు గ్రామీణాభివృద్ధి వంటి అనేక జాతీయ ప్రాధాన్యతలను ఏకకాలంలో పరిష్కరించే, ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడిన ఒక పరిష్కారాన్ని మేము భారతదేశానికి తీసుకువస్తున్నామన్నారు.