నిరుద్యోగులకు ఉచిత రాకేష్ రెడ్డి ఈ క్లాస్ యాప్
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 8న జరగనున్న "రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్" లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు భూపతి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. నాణ్యమైన, పోటీ పరీక్షల శిక్షణ అందించాలనే లక్ష్యంతో, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో Chakravarty E-Classroom భాగస్వామ్యంతో రూపొందించిన "Rakesh Reddy E-Classes App" లాంచ్ కార్యక్రమాన్ని,జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు భూపతి శ్రీనివాసరావు కోరారు.
ఈ సందర్భంగా భూపతి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ యాప్ ఒక గొప్ప అవకాశమని అన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన కోర్సులు, స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ నెల 8వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్, రైటర్ బస్తీలో నిర్వహించనున్న "Rakesh Reddy E-Classes App Launch & Awareness ప్రారంభించనున్నారు.






