19 May, 2026 | 4:57 AM

మూడు రోజులూ భారీ ఎండలు

19-05-2026 12:29 AM
  1. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
  2.   2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర అధికం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): నేటి నుంచి రాబోయే మూడు రోజు ల పాటు రాష్ట్రంలో ఎండలు భగభగ మండనున్నాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదవుతాయని, రోజువారీ కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర క్రమం గా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది.

సోమవారం నిజామాబాద్ జిల్లా కోట్‌గిరిలో 45.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.