19 May, 2026 | 1:46 AM

‘మరకత మల్లికార్జున స్వామి’ ఆలయ ప్రతిష్ఠాపన

19-05-2026 12:39 AM

రూ.17.50 లక్షల భారీ విరాళం

మొయినాబాద్, మే 18(విజయక్రాంతి): మొయినాబా ద్ మండలం చాకలిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన మరకత మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన విశేషమైన ’మరకత శివలింగాన్ని’ కాశీ నగరం నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఆలయ నిర్మాణానికి చాకలిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ దాత రేనట్ల రాజు గౌడ్  రూ.17,50,000 భారీ విరాళాన్ని అందజేశారు.

ఆయన చూపిన భక్తి శ్రద్ధలను, ఉదారత్వాన్ని అభినందిస్తూ గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.నూతన ఆలయ స్థాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.