భారజల కర్మాగారం సైంటిఫిక్ అసిస్టెంట్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భారజల కర్మాగారంలో సైంటిఫిక్ అసిస్టెంట్స్ అసోసియేషన్ (SASA) నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారి బి. అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బి. మోహన్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా షేక్ రన్ను హుస్సేన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏ. శ్రీనివాసులు, ఎం. నాగేంద్రకుమార్, సంయుక్త కార్యదర్శిగా డి. నవీన్‌కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సంకట ప్రసాద్, సంక్షేమ కార్యదర్శిగా ఎం. పాండు, కార్యాలయ కార్యదర్శిగా బి.ఎం.వి. నాగవేంద్రరావు, కోశాధికారిగా జయశంకర్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా ఎన్.డి. జైసన్, సీహెచ్.వి. రమణ, జి. దిలీప్‌కుమార్, సముద్రాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తమ ఎన్నికకు సహకరించిన అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులకు నూతన అధ్యక్షుడు బి. మోహన్‌బాబు, ప్రధాన కార్యదర్శి షేక్ రన్ను హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.






