28 July, 2026 | 3:44 PM

చికిత్సకు రూ.1 లక్ష ఎల్‌వోసీ అందజేత

28-07-2026 02:54 PM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు

మంథని,(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన నక్క నరేష్‌కు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.1 లక్ష ఎల్‌వోసీ మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ఈ ఆర్థిక సహాయం అందింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నక్క నరేష్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1 లక్ష ఎల్‌వోసీ మంజూరు చేయించారు.

మంజూరైన ఎల్‌వోసీ పత్రాన్ని హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమకు అత్యవసర సమయంలో అండగా నిలిచి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.