తాండూరులో భారీ కాషాయ జెండా ఆవిష్కరణ
28-07-2026 02:49 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం ఇందిరా చౌక్ సమీపంలోని శ్రీ బసవేశ్వర మహారాజ్ దుకాణ సముదాయం వద్ద హిందూ వాహిని కార్యకర్తలు నూతన భారీ కాషాయ జెండా ఆవిష్కరణ చేశారు. ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహించి జైశ్రీరామ్... భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.






