మొక్కలను పెంచుదాం - పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాo
మున్సిపల్ కమిషనర్ సి.హెచ్.నాగరాజు
నేరేడుచర్ల: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మొక్కల పెంపకం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం నాడు మున్సిపాలిటీ పరిధిలోని 7వ మరియు 8వ వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ కొణతం వెంకట రెడ్డి అధ్యక్షతన వనమహెూత్సవ కార్యక్రమ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, హరితహారం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పచ్చని పర్యావరణాన్ని భావితరాలకు అందించాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు.ప్రజలు తమ ఇళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ వైస్ ఛైర్మన్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.






